Thursday, 19 December 2019

హుక్కా సెంటర్ పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి

తెలంగాణ : నిబంధలనకు విరుద్ధంగా  నడుస్తున్నహుక్కా సెంటర్ పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం  దాడి చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. రూ.4,250 నగదు, 15 హుక్కా పాట్స్‌, 21 హుక్కా పైపులు, 8 హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకున్నారు.బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్‌ 2 వద్ద ఉన్న గ్రిల్‌ అండ్‌ సిజ్‌టర్స్‌పై దాడి చేశారు. హుక్కా పేరు చెప్పి మత్తు ఎక్కువ ఉందే వాటిని కలుపుతున్నారనే సమాచారం రావడంతో దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డిసిపి రాధాకిషన్‌ రావు పర్యవేక్షణలో వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై రంజిత్‌, పిసిలు దాడి చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.
No comments:

Post a comment