Thursday, 19 December 2019

రెండింతలు లాభాలు ఇస్తామని భారీ మోసం

హైదరాబాద్ : భువనగిరి ప్రాంతానికి చెందిన భుష్రా  బేగం,సిరాజ్ ఉర్ రహ్మాన్ అలియాస్ శ్రీరామ్ రాజ్ ను గురువారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసారు .ముస్లిం మహిళల కోసం యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ కేంద్రం అని ఏర్పాటు చేసి దానికి వ్యవస్థాపకులు గా భుష్రా  బేగం,సిరాజ్ ఉర్ రహ్మాన్ వ్యవహరిస్తున్నారు,ఈ కేంద్రాన్ని పలు శాఖలుగా విభజించి మలక్పేట్,పురానా  పూల్,హవెలి ప్రాంతాల్లో ప్రారంభించి అక్కడ ఉన్న మహిళలకు మాయ మాటలు చెప్పి హీరా ఫుడెక్స్, హీరా గోల్డ్, హీరారిటైల్,ఇస్లామిక్ పబ్లిక్ స్కూల్ లో డిపాసిట్లు చేయించి దానికి రెండింతలు లాభాలు ఇస్తామని ఆశపుట్టించారు ,దీనిని నమ్మిన ఆర్షియా సుల్తానా అనే ఆమె పెట్టుబడి పెట్టడంతో పాటు వారి బంధువులతో కూడా కోటి రూపాయల వరకు డిపాజిట్ చేయించింది,ఇపుడు ఆ డబ్బులు సిరాజ్ ఉర్ రహ్మాన్ ను తిరిగి ఇవ్వమని కోరగా అతను వాయిదాలు వేస్తూ వచ్చాడు .దీంతో ఆమె విసుగు చెంది సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది.కేసు దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేసి గురువారం జుడిషియల్ రిమాండ్ కు తరలించారు. 

No comments:

Post a comment